అమరావతి: ప్రతిష్టాత్మక దిశ చట్టం పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన దీపికకు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ.. మంగళగిరికి బదిలీ చేసిన విషయాన్ని నోటిఫై చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో డీజీపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి విధులు నిర్వర్తించనున్నారు. కాగా దిశ చట్టం అమలులో భాగంగా ఇద్దరు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఐఏఎస్ విభాగంలో కృతికా శుక్లా, ఐపీఎస్ విభాగంలో దీపిక దిశ ప్రత్యేక అధికారిణిలుగా నియమితులయ్యారు. (‘దిశ’ కాల్‌తో అర్ధరాత్రి బాలికకు రక్షణ)
ఐపీఎస్ దీపికకు ఎస్పీగా పదోన్నతి