‘ఆయన మనవడికి సుమతి శతకాలు ఎందుకు బోధించలేదు’

విశాఖపట్నం: ఇటలీ, స్పెయిల్ వంటి దేశాలలో సైతం కరోనా వైరస్‌ తీవ్రస్థయిలో విజృంభిస్తున్న తరుణంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అనకాపల్లిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కరోనా ఏవిధంగా వణికిస్తోందో మనం చూస్తూనే ఉన్నామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయిన పరిస్థతులు వచ్చాయని పేర్కొన్నారు. ఇక మన రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్ధాయిలో కృషి చేస్తున్నారో కూడా మనం చూస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా ప్రతీ ఇళ్లు జల్లెడ పట్టడానికి అవకాశం ఏర్పడిందని, వాలంటీర్లతో ఏపిలో చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మూడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన గత ప్రభుత్వం తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం మేటర్ పీక్....పబ్లిసిటీ వీక్.. అదే చంద్రబాబు అయితే మేటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అని ఎద్దేవా చేశారు. (తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి)